అలాంటి చెత్త ప‌ని చేసి వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న జ‌గ‌ప‌తిబాబు.. మ‌ళ్లీ లైఫ్ ఇచ్చింది ఎవ‌రో తెలుసా?

న‌టుడు జ‌గ‌ప‌తిబాబు గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్ జ‌గ‌ప‌తిబాబు.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. తండ్రి స‌పోర్ట్ వ‌ల్ల అవ‌కాశాలు ఈజీగానే వ‌చ్చినా.. స‌క్సెస్ కోసం స్వ‌యంకృషితో క‌ష్ట‌ప‌డ్డారు. స్టార్డ‌మ్ ద‌క్కించుకున్నాడు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి.. వంద‌ల కోట్ల ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్నారు.

కానీ, ఓ చెత్త ప‌నితో హీరోగా సంపాదించిన ఆస్తుల‌న్నీ పోగొట్టుకుని ఒకానొక స‌మ‌యంలో జ‌గ‌ప‌తిబాబు జీరో అయిపోయారు. గ‌తంలో ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టారు. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో త‌న ఆస్తుల‌న్నీ పోవ‌డానికి కార‌ణం ఏంటో వెల్ల‌డించారు. జ‌గ‌ప‌తిబాబుకు క్యాసినో, గ్యాంబ్లింగ్ అల‌వాటు ఉంద‌ట‌. వీటి వ‌ల్ల జ‌గ‌ప‌తి బాబు చాలా ఆస్తుల‌ను పోగొట్టుకున్నార‌ట‌. అలాగే కొంత‌మంది స‌న్నిహితులు జ‌గ‌ప‌తిబాబు దగ్గర డబ్బు తీసుకుని.. తిరిగి ఇవ్వకుండా మోసం చేశార‌ట‌.

ఇక అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌తో కొంత పోగొట్టుకున్నార‌ట‌. అలా మొత్తం డ‌బ్బు పోగొట్టుకున్న జ‌గ‌ప‌తిబాబుకు హీరోగా కూడా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యాల‌ని చూస్తున్న త‌రుణంలో బోయ‌పాటి శ్రీ‌ను `లెజెండ్‌` మూవీలో విల‌న్ గా చేసే అవ‌కాశం ఇచ్చి మ‌ళ్లీ లైఫ్ ఇచ్చారు. ఆ సినిమా ఆయ‌న కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ విల‌న్ గానే కాకుండా స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. హీరోల‌కు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటూ.. పోయిన ఆస్తి మొత్తం మ‌ళ్లీ సంపాదించారు.