అల్లు అర్జున్ కంటా ముందే 2 సార్లు నేష‌న‌ల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్ర‌క‌టించిన‌ 69వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు ఇండ‌స్ట్రీ పంట పండిన సంగ‌తి తెలిసిందే. అనేక విభాగాల్లో ప‌దికి పైగా అవార్డుల‌ను టాలీవుడ్ సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా `పుష్ప‌` సినిమాకుగానూ ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఉత్త‌మ న‌టుడి కేట‌గిరిలో జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు.

ఇక‌పోతే అల్లు అర్జున్ కంటా ముందే టాలీవుడ్ కు చెందిన ఓ హీరో రెండు సార్లు నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు అక్కినేని నాగార్జున‌. అయితే నాగార్జున‌కు ఉత్త‌మ న‌టుడిగా కాకుండా వేరు వేరు విభాగాల్లో అవార్డు వ‌చ్చింది. నాగార్జున నటించిన `అన్నయ్య` సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అయితే భ‌క్తిర‌స చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. 45 వ జాతీయ అవార్డుల్లో స్పెషల్ మెన్షన్ క్యాటగిరిలో అన్న‌మ‌య్య సినిమాకు గానూ నాగార్జున అవార్డు అందుకున్నాడు.

అలాగే నాగార్జున నటించిన మరో సినిమా `నిన్నే పెళ్లాడతా`ను కూడా జాతీయ అవార్డు వ‌రించింది. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ తెలుగు క్యాటగిరిలో నిన్నే పెళ్లాడతా సినిమా అవార్డు దక్కింది. ఈ సినిమాకు నాగార్జున నిర్మాత కావడంతో ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. అలా అల్లు అర్జున్ కంటా ముందే నాగార్జున రెండు సార్లు నేష‌న‌ల్ అవార్డును ద‌క్కించుకున్నారు.