నందమూరి హీరో బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు సుపరిచితమే.. ఇప్పటికే కూడా తన సినిమాలతో అభిమానులను ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాలయ్య ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారని చాలామంది సెలబ్రిటీతో సైతం తెలియజేయడం జరిగింది. అయితే ప్రపంచంలోనే బాలయ్యకు మాత్రమే సాధ్యమైన ఒక అరుదైన రికార్డు ఉన్నది.. అదేమిటంటే ఓకే హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే తేదీన విడుదల కావడం జరిగింది.
బాలయ్య నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ చిత్రాలు సైతం ఒకే సెంటిమెంటును ఫాలో అవుతూ ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లో విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు థియేటర్లలో 100 రోజుల పైగా ఆడడం జరిగిందట.. ఇలా ప్రపంచంలో బాలయ్యకు మాత్రమే సాధ్యమైన ఈ అరుదైన రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతోంది. బాలయ్య తన సినిమాల ఫలితాల గురించి రికార్డుల గురించి ఎప్పుడు ఆలోచించరు. కేవలం తమ అభిమానుల కోసము ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధంగానే ఉంటారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలు మేలుకోరే కొంతమంది హీరోలలో బాలయ్య కూడా ఒకరు నిర్మాత డబ్బులను మాత్రం వృధా చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు.. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో తన పంద చూపిస్తూ ముందుకు వెళుతున్నారు బాలయ్య. ముఖ్యంగా యువ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ సక్సెస్ అవుతున్నారు.