మనం.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తారాల హీరోలు ఇందులో నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి సినిమా కూడా ఇదే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించారు. శ్రియా, సమంత హీరోయిన్లుగా చేశారు. ఏఎన్నార్, అఖిల్, అమల, రాశి ఖన్నా, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది ఈ సినిమాలో భాగం అయ్యారు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించారు. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నాగార్జున-శ్రియా, నాగచైతన్య-సమంత జంటల కెమిస్ట్రీ బాగా కనెక్ట్ అయింది.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మనం మూవీకి శ్రియా ఫస్ట్ ఛాయిస్ కాదు. నాగార్జునకు జోడీగా మొదట మరొక హీరోయిన్ ను అనుకున్నారట. కానీ, ఆమె మనం సినిమాను రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ అన్ లక్కీ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి. అప్పటికే నాగార్జున, అనుష్క జంటగా డాన్, డమరుకం చిత్రాలు చేసి.. ఆన్ స్క్రీన్ పై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే `మనం` మూవీ కోసం శ్రియా కంటే ముందు అనుష్కను సంప్రదించారట. కానీ, అనుష్క ఆల్రెడీ `మిర్చి` మూవీతో పాటు పలు ప్రాజెక్ట్ లకు కమిటై ఉంది. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మనంను రిజెక్ట్ చేసిందట. అనుష్క రిజెక్ట్ చేయడంతో మనంలో నాగార్జునకు జోడీగా నటించే అవకాశం శ్రియాకు దక్కింది.