త‌మ‌న్నాకు భోళాశంక‌ర్ ప్రి రిలీజ్ ఈవెంట్ క‌న్నా సెలూన్ షాప్ ఓపెనింగ్ ఎక్కువా.. ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా కథానాయకగా రాబోతున్న చిత్రం ” భోళాశంకర్ “. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో నిన్న విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈవెంట్ కు హీరోయిన్ తమన్నా మాత్రం హాజరు కాలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ మా బాస్ మూవీ ఫంక్షన్ కి ఎందుకు రాలేదు? అంటూ తమన్నా పై కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తమన్నా భోళాశంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడానికి ఓ కారణం ఉందట. తమన్నా నిన్న ముంబైలో మరో ఈవెంట్ కి హాజరయ్యింది. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ఫ్లోరియన్ హురెల్ ముంబయిలో మొట్ట మొదటిసారిగా సెలూన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మిల్కీ బ్యూటీ తమన్న ముఖ్య అతిథిగా హాజరయ్యింది. అందువల్ల భోళాశంకర్ ఈవెంట్ కి తమన్నా రాలేకపోయింది అని తెలుస్తుంది.

ఈవెంట్ కి రాకపోయినా ప్రమోషన్స్ లో మాత్రం యాక్టివ్గా పాల్గొంటదట. ఇక దీంతో తమన్నాపై మెగా అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఫ్రీ రిలీజ్ కి రాకుండా ప్రమోషన్లను పాల్గొని ఏదో హడావుడి చేస్తుంది.. మెగాస్టార్ ఈవెంట్ కన్నా సెలూన్ షాప్ ఓపెనింగ్ ఎక్కువైపోయిందిదా అంటూ ఆమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.