అదిరిపోయే ఆఫర్ అందుకున్న సంయుక్త మీనన్.. ఆ కుర్ర హీరో తో రొమాన్స్!

ప్రముఖ నటి సంయుక్త మినన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ చిన్నది. పవన్ కళ్యాణ్, రానా  కలిసి నటించిన సినిమా లో సంయుక్త మీనాన రానా కి భార్య గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసారా’ , ధనుష్ సరసన ‘సార్’ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వీరుపాక్ష’ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది.

వీరుపాక్ష సినిమా లో చాతబడి వచ్చిన అమ్మాయి గా సంయుక్త మీనన్ అధరగొట్టేసిందనే చెప్పాలి. అయితే సంయుక్త మీనన్ విరుపక్ష సినిమా తరువాత కాస్త సైలెంట్ అయిందనే చెప్పాలి. ఈ మధ్య మహేష్ బాబు సినిమా లో సంయుక్త నటించబోతుంది అనే వార్త చక్కర్లు కొట్టింది కానీ ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. మరి సంయుక్త సైలెంట్ గా ఉండటానికి కారణం ఏంటా?  అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

వరుస సినిమా విజయాలను అందుకున్న సంయుక్త తన నెక్స్ట్ సినిమాల విషయం లో ఆచి తూచి అడుగేస్తుందని తెలుస్తుంది. అందుకే వీరుపాక్ష సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకుందని చాలా మంది అంటున్నారు. అయితే తాజాగా ఈ అమ్మడు ఒక క్రేజీ ఆఫర్స్ ని అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ హీరో నిఖిల్ కి జంటగా ఒక సినిమా లో నటించబోతుందట సంయుక్త. నిఖిల్ ఒక పాన్ ఇండియా పిరియాడికల్ డ్రామా సినిమా లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా లో సంయుక్త అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం సంయుక్త తెలుగు, తమిళ భాషలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.