సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఇటీవల తన తల్లితో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె న్యూయార్క్ లో ఉంది. అక్కడ ఆదివారం అట్టహాసంగా జరిగిన `ఇండియా డే పరేడ్` లో సమంత పాల్గొంది. ఈ వేడుకల్లో ఆమె చాలా హుషారుగా కనిపించింది. అనంతరం న్యూయార్క్ అందాలను ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా బ్లాక్ కలర్ చీరలో దర్శనమిచ్చి నెటిజన్లకు మైంబ్ బ్లాక్ అయ్యేలా చేసింది. శారీ కట్టుకుని న్యూయార్క్ వీధుల్లో హోయలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది. నానా హంగామా చేసింది. పైట పక్కకు జరిపి మరీ జీరో సైజ్ అందాలతో టెంప్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పిక్స్ చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. సమంత అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ కవితలు కామెంట్ల కింద కురిపిస్తున్నారు. కాగా, సమంత మరికొద్ది రోజుల్లో `ఖుషి` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. మరి సినిమా విడుదలకు ముందు సమంత ఇండియాకు వస్తుందా.. లేదా.. అన్నది సస్పెన్స్ గా మారింది.
View this post on Instagram