టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి పీటలెక్కింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. వివాహం అనంతరం పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. గత ఏడాది ఈ బ్యూటీ పండంటి మగబిడ్డ జన్మించగా.. కొడుకు పుట్టిన కొద్ది నెలలకే కాజల్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ప్రెగ్నెన్సీ వల్ల పెరిగిన బరువును తగ్గించుకుని మునుపటిలా అందంగా, ఫిట్ గా మారింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం కాజల్ నటసింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా `భగవంత్ కేసరి` సినిమాలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ తో శంకర్ దర్శకత్వంలో `ఇండియన్ 2` మూవీతో చేస్తోంది. వీటితో పాటు `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కమిట్ అయింది. మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. అయితే చేతి నిండా సినిమాలున్నా కాజల్ కు సుఖం లేదట.
పెళ్లై బిడ్డ పుట్టిన తర్వాత కూడా హీరోయిన్ గా కాజల్ చాలా బిజీగా ఉంది. అయినా సరే ఆమెకు సంతోషం లేదట. ఎందుకంటే, మునుపటిలా టాప్ స్టార్స్ ఎవరూ కాజల్ ను కన్నెత్తి కూడా చూడట్లేదు. పెళ్లికి ముందు వరకు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి యంగ్ స్టార్స్ తో జతకట్టింది. మరోవైపు కోలీవుడ్ లోనూ తన హవా చూపించింది. కానీ, ఇప్పుడు వారెవరూ కాజల్ తో సినిమా చేసేందుకు మక్కువ చూపట్లేదు. ఒకరిద్దరు దర్శకులు కాజల్ ప్రస్తావన తెచ్చినా.. ఆయా హీరోలు వెంటనే ఆమె వద్దు యంగ్ హీరోయిన్లను పెట్టుకుందామని చెబుతున్నారట. ఈ విషయం కాజల్ ను బాగా బాధపెడుతుందట. అందుకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ అవ్వాలని కాజల్ నిర్ణయించుకున్నట్లు టాక్.