జైల‌ర్ ముందు తేలిపోతున్న భోళా.. అక్క‌డ ర‌జ‌నీ హ‌వాను చిరంజీవి త‌ట్టుకోగ‌ల‌డా?

మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్‌, ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమాలు ఈ వారంలో ఒక్క రోజు వ్య‌వ‌ధిలో విడుద‌ల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే బుక్కింగ్స్ ఊపందుకున్నాయి.

అయితే అమెరికాలో జైల‌ర్ ముందు భోళా శంక‌ర్ బాగా తేలిపోతోంది. ర‌జ‌నీ హ‌వాను చిరంజీవి త‌ట్టుకోగ‌ల‌డా అన్న అనుమానాలు కూడా త‌లెత్తుతున్నాయి. ఎందుకంటే.. అడ్వాన్స్ బుక్కింగ్స్ లో భోళాతో పోలిస్తూ జైల‌ర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా భోళా శంక‌ర్ ఇప్పటి వరకు టోటల్ గా 110కె డాలర్స్ ను అందుకుంది. అయితే భోళా శంక‌ర్ తో పోలిస్తే జైల‌ర్ ఐదు రెట్లు ఎక్కువ సంపాదించింది.

ఇప్ప‌టికే అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా జైల‌ర్ కు ఏకంగా 520కె మార్క్ ని 1 మిలియ‌న్ దిశ‌గా దూసుకుపోతుంది. మ‌రి జైల‌ర్ ధాటిని త‌ట్టుకుని భోళా శంక‌ర్ నెగ్గుకొస్తుందా..లేదా.. అన్న‌ది చూడాలి. కాగా, సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలోనే భోళా శంక‌ర్ ను మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కించారు. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి సోద‌రిగా న‌టించింది. జైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన‌ ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించాడు. ర‌జ‌నీ ఈ మూవీతో గ‌ట్టి కంబ్యాక్ ఇస్తాడ‌ని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.