బిడ్డకు పాలు ఇవ్వడం కూడా నీకు  బరువేనా.. ఆ చెత్త కామెంట్స్ ఏంటి..

టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటుగా ఇతర భాషలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సనాఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి ఎన్నో సినిమా లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలానే యాడ్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ లో కూడా ఫుల్ యాక్టివ్ గ ఉంటుంది ఈ బ్యూటీ. అయితే కొన్ని రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సనాఖాన్. ఈ క్రమంలోనే బిడ్డకు పాలివ్వడం గురించి కొన్ని షాకింగ్ చేసింది. సనాఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఇతర ఆహారపదార్దాలతో పోలిస్తే తల్లి పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి అని ఆమె తెలిపారు. అలానే తల్లి పాలు తాగడం తాగడం వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఆరోగ్యం సమస్యలు రావు. పిల్లలకు పాలు ఇవ్వడం చాలా ముఖ్యం అని, దానివల్ల వారికి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సహాఖాన్ వెల్లడించారు. నా బిడ్డకు నెలరోజులు పాలు ఇవ్వడం ద్వారా నేను 15 కిలోల వరకూ బరువులు తగ్గానని ఆమె చెప్పడం గమనార్హం. పిల్లలకి పాలు ఇవ్వడం వాళ్ళ తల్లులు బరువు తగొచ్చని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది సనాఖాన్ వెల్లడించారు. తల్లి పాల గురించి సనాఖాన్ చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గ మారాయి.

అయితే ఆమె చెప్పిన విషయాల గురించి కొంత మంది నెగిటివ్ గా స్పందిస్తున్నారు. సనాఖాన్ ప్రతీ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదో మీకు తెలీదా అంటూ ఆమెపై చాలామంది విరుచుకుపాడుతున్నారు. అలానే ఆమె త్వరలోనే రి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని అందుకోవాలని సనాఖాన్ అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి సన కి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రం ఆమెకి మంచి ఆఫర్స్ ఏ వస్తున్నాయి. ఇక సనాఖాన్ సినీ కెరీర్ ఎలా ఉంటుందో అనేది తెలియాల్సి ఉంది.