చిరంజీవి సక్సెస్ కావాలి అంటే వారు బరిలోకి దిగాల్సిందేనా..?

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య మంచి అనుబంధం ఉందని తెలిసిన విషయమే అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా మనస్పర్ధలు వచ్చాయని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. ఏదో ఒక సందర్భాలలో సమాధానాలతో ఇలాంటి విషయాలకు చెక్ పెడుతూనే ఉన్న రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉంటాయి.. అయితే ఇప్పుడు చిరంజీవికి అల్లు అరవింద్ అండ అనుభవం అవసరమనే వాదనలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అది వ్యక్తిగత జీవితంతో కాదు సినిమాల విషయంలో అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Talk of the Town: Differences between Chiranjeevi & Allu Aravind?

చిరంజీవి రీ ఎంట్రీ లో చిరంజీవి చేసే సినిమాలు అన్నీ కూడా భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి.. కేవలం వాల్తేరు వీరయ్య సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవల భోళా శంకర్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.. దీంతో చిరంజీవి అల్లు అరవింద్ తో కలిసి పని చేయాలని ఎంతోమంది అభిమానులు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. వాస్తవానికి వీరిద్దరూ కలిసి సినిమా చేయక దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతోంది.

చివరిగా వీరిద్దరూ 2005లో అందరివాడు సినిమా చేశారు. ఆ తర్వాత చిరంజీవి పొలిటికల్ గా వెళ్లడంతో అల్లు అరవింద్ కూడా మిగతా వాళ్లతో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సంబంధించిన వ్యవహారాలను చూసుకొనేవారు అల్లు అరవింద్.చిరంజీవి రీఎంట్రీ అయినా సరే సినిమాలకు సంబంధించిన నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ చూసుకున్నారు. అలా ఖైదీ నెంబర్ 150, సైరా, ఆచార్య వంటి సినిమాలను తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలలో కూడా అల్లు అరవింద్ హ్యాండ్ లేదు.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది ఎప్పుడు కూడా కలిసి ఏదైనా సినిమా చేసే దిశగా సంకేతాలు కూడా తెలియలేదు.. అందుచేతనే కథలను జడ్జ్ చేయడంలో అల్లు అరవింద్ సాటి రారని చిరంజీవికి కచ్చితంగా ఇప్పుడు ఆయన సపోర్ట్ అవసరమని అభిమానులు తెలుపుతున్నారు.