పైన ఫోటోలో తండ్రి వెనక నిలబడి క్యూట్ గా స్మైల్ ఇస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..? సౌత్ లో ఆమె స్టార్ హీరోయిన్. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఆమెకు యమా క్రేజ్ ఉంది. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను సంపాదించుకుంది. సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది.
ఇప్పటికైనా ఆమె ఎవరో గెస్ చేశారా.. మన మహానటి కీర్తి సురేష్ చిన్ననాని ఫోటో అండీ బాబు. మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్.. గీతాంజలి మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. నేను శైలజతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతో హిట్ అందుకుని యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయింది.
మహానటి మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ అనంతరం వరుస ఫ్లాపులతో కీర్తి సురేస్ కాస్త సతమతం అయినా.. సర్కారు వారి పాటతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆపై దసరా, నాయకుడు చిత్రాలతో వరుసగా రెండు భారీ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ భోళా శంకర్ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రను ఆమె పోషించింది. కానీ, ఈ సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తన తదుపరి ప్రాజెక్ట్ లపై దృష్టి సారింది.