మలయాళ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ ఫహద్ ఫాసిల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పుష్ప` సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ అదరగొట్టేశాడు. `పార్టీ లేదా పుష్ప` అంటూ నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పుష్ప 2లో విశ్వరూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన నాయకుడు చిత్రంలో ఫహద్ ఫాసిల్ తప నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశాడు.
ప్రస్తుతం సౌత్ భాషల్లో ఫుల్ బిజీగా యాక్టర్ గా దూసుకుపోతున్న ఫహద్ ఫాసిల్ తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఫహద్ ఫాసిల్ మరియు ఆయన సతీమణి, టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఇటీవల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫహద్ ఫాసిల్ ఓ కొత్త కారును కొనుగోలు చేశాడు.
`ల్యాండ్ రోవర్` కంపెనీకి చెందిన డిఫెంబర్ 90 వేరియెంట్ కారును ఆయన సొంతం చేసుకున్నాడు. అత్యంత లగ్జరీగా మరియు సూపర్ ఎట్రాక్టివ్ గా ఉంటే ఈ కారు చాలా మంది సెలబ్రెటీస్ గ్యారేజ్ లో ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఫహద్ ఫాసిల్ దంపుతులకు కూడా చేరారు. ఇంతకీ ఫహద్ కొత్త కారు ఖరీదెంతో తెలుసా రూ. 2.11 కోట్లు. పనితీరు పరంగా అద్భుతమైన ఈ కారు వాహనదారులకు ఉపయోగపడే అన్నీ ఫీచర్లను కలిగి ఉంది.