50 ఏళ్ల వయసులో పెళ్లిపై నటి సుకన్య రియాక్షన్ ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో చిత్రాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించింది నటి సుకన్య.. ముఖ్యంగా ఈమె సీనియర్ నటి అయినప్పటికీ ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు.. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించి మంచి మార్కుల సంపాదించుకుంది. ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సుకన్య తెలుగు ,తమిళ్ ,కన్నడ మలయాళం వంటి భాషలలో నటించింది.

తెలుగులో పెద్దరికం ,అమ్మ కొడుకు, ఖైదీ నెంబర్, తదితర చిత్రాలలో హీరోయిన్గా నటించింది. ఎన్నో చిత్రాలలో హీరోయిన్లకు, హీరోలకు తల్లి పాత్రలలో నటించిన ఈమె కెరియర్ పరంగా బాగానే సక్సెస్ అయ్యింది.. 2002లో శ్రీధరన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది. అలా విదేశాల నుంచి తిరిగి ఇండియాకి వచ్చినటువంటి ఈమె ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే ఇతరుణంలోనే ఈమె రెండో పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

భర్తకు విడాకులు ఇచ్చినటువంటి సుకన్య త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై సుకన్య మాట్లాడుతూ నా వయసు 50 సంవత్సరాలు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలకు నన్ను అమ్మ అని పిలుస్తారా లేకపోతే అమ్మమ్మ అని పిలుస్తారా అంటూ తనదైన సైజులో కౌంటర్ ఇస్తోంది సుకన్య..దీంతో తను రెండవ పెళ్లి చేసుకోవడం లేదని విషయం పైన క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మరి ఈ విషయం పైన ఇకమీదట రూమర్లు ఆగిపోతాయేమో చూడాలి మరి.