పూనమ్ ట్వీట్ కు వర్మ రిప్లై….అసలు విషయం ఏమిటంటే?

పవన్ కళ్యాణ్ ఈ మధ్య నటించిన చిత్రం “బ్రో”. గడిచిన కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర తనను ఉద్దేశించి చిత్రీకరించారంటూ ఫైర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇంటర్వ్యూలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం పై తెలుగు సినీ నటి “పూనమ్ కౌర్” స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా పూనమ్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ ఆర్జీవి మరో ట్వీట్ చేసారు. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

మన జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సంబరాలలో డాన్సులు చేసి వార్తలలోకి ఎక్కారు. ఈ సందర్భాన్ని పవన్ కళ్యాణ్ చిత్రం బ్రో లో పేరడీగా పెట్టడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలోని ఒక సన్నివేసంలో యాక్టర్ పృథ్విరాజ్ మంత్రి గారిని అనుకరిస్తూ డాన్స్ చేస్తే ఆయన పై పవన్ కళ్యాణ్ సెటైర్లు వేయడం ఉంటుంది. ఈ సన్నివేశం ఇప్పుడు దుమారం రేపుతోంది. విలేకరుల సమావేసంలో రాంబాబు గారు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి, పవన్ కళ్యాణ్ దీనికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించారు.

ఈ విషయానికి స్పందిస్తూ పూనమ్ కౌర్ “రాజకీయాలు ఎంటర్టైనింగ్ గా. ఎంటర్టైన్మెంట్ సో సీరియస్ గా మారిపోయాయి” అని సెటైర్ వేశారు. ఈ ట్వీట్ కు ఆర్జీవీ స్పందించారు. ఆమె రాజకీయాలు ఎంటరైన్మెంట్ గా మారాయి అన్న మాట తో ఏకీభవించట్లేదు అన్నారు. ఇలా అంటూనే ట్విట్టర్ ద్వారా ఆమెకు రిప్లై కూడా ఇచ్చారు. “నో సిస్టర్..” అంటూ మొదలుపెట్టి తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. “రాజకీయాలు సినిమాలుగా….సినిమాలు రాజకీయాలుగా తయారయ్యాయి” అని ట్వీట్ చేసారు. ఐతే వీళ్లిద్దరి చేసిన ట్వీట్లకు అటు పవన్ కళ్యాణ్, ఇటు అంబటి రాంబాబు, ఇద్దరు మౌనంగానే ఉన్నారు.