రిలీజ్ కు సిద్ధంగా ర‌జ‌నీ `జైల‌ర్‌`.. మాజీ అల్లుడు ధ‌నుష్ ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ మూవీ `జైల‌ర్‌` మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం ఈ చిత్రంలో త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివరాజ్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రేపు ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కానుంది. మొద‌ట ఈ సినిమాపై పెద్ద హైప్ లేక‌పోయినా.. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత‌ అంచ‌నాలు భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి.

త‌మిళ‌నాట ఇప్ప‌టికే థియేట‌ర్స్ వ‌ద్ద త‌లైవా ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సాలిడ్ గా జ‌రిగింది. జైల‌ర్ తో ర‌జ‌నీకాంత్ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇస్తార‌ని అభిమానులు ఆశ ప‌డుతున్నారు. ఇక ఇదే త‌రుణంలో ర‌జనీ మాజీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. కొద్ది నెల‌ల క్రిత‌మే ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య‌, ధ‌నుష్ విడాకులు తీసుకున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. నిజానికి వీరిద్ద‌రూ ప్రేమించుకుని.. ఆపై పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. త‌న అభిమాన హీరో అయిన ర‌జ‌నీకాంత్ కు అల్లుడు అయ్యాడు.

ర‌జనీకాంత్ అల్లుడు అయ్యాకే.. ధ‌నుష్ కోలీవుడ్ లో స్టార్ అయ్యాడు. అయితే అనూహ్యంగా ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య 18 ఏళ్ల తమ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ర‌జ‌నీ ఎంత ప్ర‌య‌త్నించినా.. వీరిద్ద‌రూ క‌లిసి ఉండేందుకు ఒప్పుకోలేదు. అయితే రిలీజ్ కు ర‌జ‌నీ మూవీ సిద్ధంగా ఉన్న స‌మ‌యంలో.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ధ‌నుష్ `ఇట్స్ జైల‌ర్ వీక్` అంటూ ట్వీట్ చేశాడు. మాజీ మామ‌గారి సినిమాకు త‌న స‌పోర్ట్ అందించాడు. ఐశ్వ‌ర్య‌తో విడిపోయినా.. ర‌జ‌నీకాంత్ పై త‌న అభిమానం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ధ‌నుష్ నిరూపించుకున్నాడు. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న తీరుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.