ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అదితి శంకర్.. ప్రస్తుతం కోలీవుడ్ లో యమా జోరు చూపిస్తోంది. ఎంబీబీబీఎస్ పూర్తిచేసిన అదితి.. నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లోకి వచ్చింది. కార్తి హీరోగా నటించిన `విరుమన్` మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా విడుదలైన `మావీరన్` సినిమాలో శివకార్తికేయన్‌కు జోడీగా నటించింది.
ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించడంతో.. అదితి కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. ఇప్పుడు అదితికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే అదే సమయంలో అదితికి సంబంధించి మరో షాకింగ్ వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే.. అదితిని ఆమె తల్లిదండ్రులు డాక్టర్ గా చూడాలని ఆశపడ్డారు. కానీ, ఎంబీబీబీఎస్ తర్వాత అదితి నటనవైపు అడుగు వేసింది. కూతురు సినిమాల్లోకి రావడం శంకర్ కు ఏ మాత్రం ఇష్టం లేదు.
అందుకే సినిమాల్లోకి వచ్చే శంకర్ అదితికి ఓ కండీషన్ పెట్టారట. రెండేళ్లు నువ్వు ఎన్ని సినిమాల్లో అయినా నటించు.. కానీ, ఆ తర్వాత మాత్రం పెళ్లి చేసుకోవాలని శంకర్ కూతురికి కండీషన్ పెట్టాడట. ఆ కండీషన్ కు ఒప్పుకున్నాకే అదితి ఇండస్ట్రీలోకి వచ్చిందట. అందుకే ఈ రెండేళ్లల్లో వీలైనన్ని ఎక్కువు సినిమాలు చేసేందుకు అదితి ఆరాటపడుతుందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు నెటిజన్లను శంకర్ ను తప్పుబడుతున్నారు. ఛీ.. ఛీ.. స్టార్ డైరెక్టర్ అయ్యుండి కూతురుకి ఇలాంటి చెత్త కండీసన్ పెట్టావా.. ఆమె లైఫ్ ఆమెకు నచ్చినట్లు సాగనివ్వి అంటూ శంకర్ కు చురకలు వేస్తున్నారు. మరికొందరు ఇదంతా ఉత్తుత్తి ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. మరి ఏదో నిజమే ఆ తండ్రీకూతుళ్లకే తెలియాలి.