రాఘవేందర్రావు, చిరు కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవే..

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గానే నిలిచాయి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి తన కంటూ సొంత ఇమేజ్ ని సంపాదించుకోవడం లో సక్సెస్ అయ్యాడు చిరంజీవి . ఇక ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత చిరు, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో చాలానే సినిమాలు వచ్చాయి. అవి చాలావరకు విజయం సాధించాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన సినిమా లో చిరంజీవి హీరోగానే కాకుండా కొన్ని సినిమాలో విలన్ గా కూడా నటించాడు.

అంతేకాకుండా డబల్ రోల్ , త్రిబుల్ రోల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు చిరు. చిరు, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1981 వ సంవత్సరం లో విడుదల అయిన ‘ తిరుగులేని మనిషి ‘ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించాడు చిరంజీవి. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా లో చిరంజీవి విలన్ పాత్రలో నటించాడు. ఆ తరువాత 1985 లో ‘అడవి దొంగ’ సినిమా లో చిరంజీవి టార్జాన్ గా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇక 1986 లో ‘కొండవీటి రాజా’ అనే సినిమా లో చిరంజీవి విజయశాంతి, రాధ లతో కలిసి నటించాడు.

చిరంజీవి 1986 లో ‘చాణక్య శపదం ‘ లో విజయశాంతి తో రొమాన్స్ చెయ్యగా, 1988 లో ‘మంచి దొంగ ‘, ‘ యుద్ధభూమి ‘ సినిమాలో నటించి అలరించాడు. ఆ తరువాత 1989 లో ‘ రుద్ర నేత్ర ‘ సినిమా లో రాధ, విజయశాంతి లతో నటించాడు. 1990 లో ‘ జగదేగ వీరుడు అతిలోక సుందరి ‘ సినిమా లో శ్రీదేవి తో రొమాన్స్ చేసాడు మెగాస్టార్. 1991 లో రౌడీ అల్లుడు, 1992 లో ఘరానా మొగుడు, 1994 లో ముగ్గురు మొనగ్గాళ్లు, 1999 లో ఇద్దరు మిత్రులు లాంటి సినిమాలో నటించి ప్రేక్షకులకు దెగ్గరయ్యి స్టార్ హీరోగా ఏదిగి మెగాస్టార్ బిరుదు ని సంపాదించుకొని తిరుగులేని హీరోగా కొనసాగుతున్నాడు.