రీమేక్స్ విష‌యంలో విమ‌ర్శ‌కుల‌కు చిరంజీవి స్ట్రోంగ్ కౌంట‌ర్‌.. ఒక్కొక్క‌రికీ ఇచ్చిప‌డేశాడు!

మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం నుంచి వ‌రుస రీమేక్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా రీఎంట్రీ త‌ర్వాత చిరంజీవి నుంచి వ‌చ్చిన చిత్రాల్లో స‌గం రీమేక్ సినిమాలే ఉన్నాయి. ఈ విష‌యంపై చాలా మంది ఆయ‌న్ను విమ‌ర్శించారు. చిరంజీవి రీమేక్ చిత్రాల‌పై మ‌క్కువ చూప‌టం ప‌ట్ల‌ మెగా ఫ్యాన్స్ సైతం క‌ల‌వ‌రప‌డుతున్నారు. అయితే తాజాగా ఈ విష‌యంపై చిరంజీవి స్పందించారు. విమ‌ర్శ‌కుల‌కు స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

చిరంజీవి త్వ‌ర‌లోనే `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తే.. కీర్తి సురేష్ కీల‌క పాత్ర‌ను పోషించింది. ఆగ‌స్టు 11న ఈ సినిమా విడుద‌ల కానుంది. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన `వేదాళం`కు రీమేక్ ఇది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వ‌హించారు.

అయితే ఈ ఈవెంట్ చిరంజీవి మాట్లాడుతూ.. `రీమేక్‌లు చేస్తే తప్పేంటి? మంచి కథలను ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌నుకున్న‌ప్పుడు రీమేక్ చేస్తే త‌ప్పు లేదు. క‌థ‌లో ద‌మ్ముంటే ఎప్పుడైనా ఆడియెన్స్ ఆద‌రిస్తారు. భోళా శంక‌ర్ ఒరిజినల్ వేదాళం ఏ ఓటీటీలో లేదు. ఎవ‌రూ చూడ‌లేదు. అందుకే ధైర్యంగా ఈ క‌థ‌ను ఎంచుకున్నాను. నాకు న‌చ్చే ఈ సినిమా చేశాను. ఖ‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ సినిమా క‌నెక్ట్ అవుతుంది` అంటూ విమ‌ర్శించేవారికి ఇచ్చిప‌డేశారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారుతున్నాయి. అన్న‌ట్లు ఈయ‌న త‌రుప‌రి సినిమా కూడా రీమేక్కే అని తెలుస్తోంది. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ `బ్రో డాడీ`ని చిరు తెలుగులో చేయ‌బోతున్నార‌ని టాక్‌.