స‌మంత‌కు అరుదైన గౌర‌వం.. త్వ‌ర‌లోనే అమెరికాకు పయనం!

స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల సినిమాల‌కు బ్రేక్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ బ్యూటీ కొన్ని నెల‌లు విశ్రాంతి తీసుకోవాల‌ని డిసైడ్ అయింది. ఈ నేప‌థ్యంలోనే చేతిలో ఉన్న ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ ల‌ను కంప్లీట్ చేసి ప్యాక‌ప్ చెప్పేసింది. ప్ర‌స్తుతం ఆమె వెకేష‌న్ లో ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫిజిక‌ల్‌గా మ‌రియు మెంట‌ల్ గా స్ట్రోంగ్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా స‌మంత‌కు అరుదైన గౌవ‌రం ద‌క్కింది. అమెరికాలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనే అరుదైన ఆహ్వానం ల‌భించింది. న్యూయార్క్ లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండియా పరేడ్‌ వేడుకల‌కు స‌మంత‌ను గెస్ట్ గా అహ్వానించారు. మ‌నం ఇక్క‌డ‌ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డేను సెల‌బ్రేట్ చేసుకుంటాము.

అయితే అమెరికా కాలమాణం ప్రకారం అక్క‌డ‌ ఆగస్ట్ 20న‌ ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన పరేడ్‌ని నిర్వహిస్తున్నారు. 41వ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ ఇది. ఇందులో గెస్ట్ గా పాల్గొనేందుకు స‌మంత‌ను ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా వారు స‌మంత‌ను ఇండియన్‌ లేడీ సూపర్‌ స్టార్ అని సంబోధించడం విశేషం. ఇంత‌కు ముందు ఇలాంటి అరుదైన గౌవ‌రం ఇండియ‌న్ సెల‌బ్రెటీలెవ్వ‌రికీ ద‌క్క‌లేదు. ఇక‌ త్వ‌ర‌లో స‌మంత అమెరికాకు ప‌య‌నం కాబోతోంది. సమంతతో పాటు ఆథ్యాత్మిక గురువు రవి శంకర్‌ ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.