నంద్యాల టీడీపీ సీటు ఫిక్స్..కానీ అదే డౌట్.!

నంద్యాల అసెంబ్లీ స్థానం…ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డాగా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వైసీపీదే ఆధిక్యంగా ఉంది. ఆ పార్టీని నిలువరించడం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ టి‌డి‌పి మొదట్లో మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి సత్తా చాటింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.

ఇక 2014లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టి‌డి‌పిలోకి జంప్ అయ్యారు. అనుహ్యా పరిణామాల మధ్య ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో నంద్యాల ఉపఎన్నిక రాగా, ఆ ఉపఎన్నికలో భూమా నాగిరెడ్డి సోదరుడు కుమారుడు బ్రహ్మానందరెడ్డి టి‌డి‌పి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి పోటీ చేసి బ్రహ్మానందరెడ్డిపై దాదాపు 34 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

మంచి మెజారిటీతో గెలిచి సత్తా చాటిన శిల్పా..ఎమ్మెల్యేగా బాగానే పనిచేస్తున్నారు. ఆయనపై పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు. కానీ ఇటు టి‌డి‌పిలో సీటు కోసం పోటీ ఉంది. బ్రహ్మానందరెడ్డికి చెక్ పెట్టి తన సొంత తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి సీటు దక్కేలా చేసుకోవాలని భూమా అఖిలప్రియ చూస్తున్నట్లు తెలిసింది. కానీ చంద్రబాబు మాత్రం ఈ సీటు విషయంలో క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తుంది.

మళ్ళీ బ్రహ్మానందరెడ్డికే ఆయన సీటు ఇచ్చేలా ఉన్నారు. తాజాగా బాబు..నంద్యాలలో పార్టీ పరిస్తితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంకా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి బ్రహ్మానందరెడ్డికి సూచించారు. అలాగే దాదాపు నంద్యాల సీటు ఆయనకే ఫిక్స్ చేశారని తెలిసింది. అయితే సీటు దక్కిన నంద్యాలలో వైసీపీని ఓడించడం కష్టం. అక్కడ మళ్ళీ వైసీపీ హవానే నడిచేలా ఉంది.