మంచు ల‌క్ష్మి చేసిన ప‌నికి ఆనందంతో ఉప్పొంగిపోతున్న మ‌నోజ్‌.. అక్క‌పై త‌మ్ముడు పొగ‌డ్త‌ల వ‌ర్షం!

మోహ‌న్ బాబు కూతురుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు ల‌క్ష్మి.. న‌టిగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ మ‌ధ్య అనేక సేవా కార్య‌క్ర‌మాల్లో భాగం అవుతూ తన మంచు మ‌న‌సును చాటుకుంటోంది. ఇందులో భాగంగానే టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక ఎన్జీవోని స్థాపించి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తుంది.

గ‌త ఏడాది యాదాద్రి జిల్లాలో 56 స్కూల్స్ ను ద‌త్త‌త తీసుకుని.. అన్ని మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించింది. అలాగే స్మార్ట్ క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేయిస్తూ కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ లో విద్య అందించేలా ప్రయత్నం చేస్తూ వ‌స్తోంది. అల‌గే రీసెంట్ గా తెలంగాణలోని జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో మ‌రో 30 ప్రభుత్వ పాఠశాలలను మంచు ల‌క్ష్మి ద‌త్త‌త తీసుకుంది. వాటిని కూడా స్మార్ట్ స్కూల్స్ గా మార్చే ప‌నిలో ప‌డింది.

దీంతో త‌న అక్క చేస్తున్న ప‌నికి మంచు మ‌నోజ్ ఆనందంతో ఉప్పొంగిపోతూ.. తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. మంచు ల‌క్ష్మిపై త‌మ్ముడు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. `మా అక్క‌ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది. జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో 30 స్కూల్స్ ను ద‌త్త‌త తీసుకోవ‌డం చాలా గొప్ప నిర్ణ‌యం. ఈ విష‌యంలో మా అక్కకు మద్దతు ఇచ్చిన జిల్లా కలెక్టర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు` అంటూ మ‌నోజ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది కాస్త వైర‌ల్ గా మార‌డంతో.. మంచు ల‌క్ష్మిపై నెటిజ‌న్లు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Manoj Manchu (@manojkmanchu)