పెళ్లి త‌ర్వాత మౌనిక‌కు టార్చ‌ర్ మొద‌లైంది.. మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఇటీవ‌లె మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌, మౌనిక ఏడ‌డుగులు వేశారు. నిజానికి వీరి పెళ్లి మోహ‌న్ బాబు, మంచు విష్ణుకు ఏ మాత్రం ఇష్టం లేద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం నిజ‌మే అని మంచు ల‌క్ష్మి తాజా వ్యాఖ్య‌ల‌తో తేలిపోయింది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ.. మనోజ్-మౌనికల వివాహం జరగాలని యాదాద్రిలో మొక్కుకున్నాను. మా నాన్న(మోహన్ బాబు) మనసు మార్చమని వేడుకున్నాను. ఆ దేవుడు ఆలకించాడు. మనోజ్ పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక ఇద్దరినీ యాదాద్రి తీసుకెళ్లి దర్శనం చేయించాను అంటూ చెప్పుకొచ్చింది.

 

 

అలాగే పెళ్లికి ముందు మ‌నోజ్‌, మౌనిక త‌న వ‌ద్దే ఉండేవార‌ని.. ఇప్పుడు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యార‌ని మంచు ల‌క్ష్మి పేర్కొంది. అంతేకాదు, పెళ్లి త‌ర్వాత మౌనిక‌కు టార్చ‌ర్ మొద‌లైంద‌ని మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. `పెళ్లి త‌ర్వాత కొత్త ఇంట్లో కాపురం పెట్టాక మౌనిక ఫోన్ చేసి అదెలా చేయాలి? ఇదెలా చేయాలి? అని అడుగుతుంది. నేను చెప్పకుండా టార్చర్ చేస్తుంటాను. నా దగ్గర ఉన్నప్పుడు అడిగావా? అంటూ ఆట‌ప‌ట్టిస్తాను` అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. దీంతో ఈమె వ్యాఖ్య‌లు కాస్త వైర‌ల్ గా మారాయి.