అందాల చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. తన క్లోజ్ ఫ్రెండ్, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను 2020లో కాజల్ వివాహం చేసుకుంది. కరోనా కారణంగా ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం ముంబైలో జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ అయిన కాజల్.. గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
బిడ్డ పుట్టిన రెండో రోజే కాజల్ దంపతులు కుమారుడు పేరును `నీల్ కిచ్లూ` అంటూ అనౌన్స్ చేశారు. అయితే కాజల్ కుమారుడికి నీల్ అని పేరు పెట్టడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. తనయుడికి పిలవడానికి, రాయడానికి అనువుగా ఉండేలా పేరు పెడతామని గౌతమ్ అన్నాడట. అయితే కాజల్ కు మహాశివుడు అంటే ఎంతో భక్తి అట.
శివుడిని కాజల్ ఎక్కువగా కొలుస్తుందట. అందుకే నీలకంఠుడైన శివుని పేరులోని రెండు అక్షరాలు తీసుకుని కాజల్ తన కుమారుడికి నీల్ అని నామకణం చేసిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. కాగా, నీల్ పుట్టిన కొద్ది రోజులకే కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. భగవంత్ కేసరి, ఇండియన్ 2, సత్యభామ వంటి ప్రాజెక్ట్ లలో కాజల్ భాగమైంది.