టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ చేసిన సినిమా అహింస . ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫస్ట్ సినిమా తోనే భారీ డిజాస్టర్ సొంతం చేసుకున్న ..అహింస సినిమా అట్టర్ ప్లాప్ ను నమోదు చేసుకుంది. మరీ ముఖ్యంగా సినిమా మొత్తం జయం సినిమాలాగే ఉండడం సినిమాలో చాలా సీన్స్ బోర్ కొట్టిస్తూ ఉండడం అదే లవ్ స్టోరీ అదే .. రివేంజ్ డ్రామా కావడంతో జనాలకు పిచ్చి లేసింది.
అంతేకాదు సినిమా చూసిన జనాలు దండం పెడతా ..ఈ సినిమాకు వెళ్ళకండి రా బాబు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ముఖ్యంగా అభిరామ్ నటన టూ వరస్ట్ గా ఉందని రానా దగ్గుబాటి ఎన్నో రెట్లు మేలని చెప్పుకొస్తున్నారు. పైగా తేజ డైరెక్షన్ కావడంతో ఇంకా చులకనగా చూస్తున్నారు. దీంతో అహింస సినిమా మొత్తానికి ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది . అయితే తేజ అహింస కథను వేరే స్టార్ హీరో కొడుకు కోసం రాసుకున్నారట . ఆ హీరో ఎవరో కాదు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞా. యస్..ఆ హీరో కొడుకు ఎంట్రీ ఇవ్వడానికి తేజ ఈ కథను రాసుకున్నాడట .
ఇదే కథను తీసుకెళ్లి బాలయ్యకు చెప్పాడట . అయితే డిస్కరేజ్ చేయకూడదన్న బాలయ్య కథను విందాం అంటూ కథను వినడానికి రెడీ అయ్యారట . ఫస్ట్ పేజీ స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వగానే అహింస సినిమా దొబ్బేస్తుంది అని ముఖానే చెప్పేసాడట. కథలో పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం ..సినిమా లో ఆ పస తగ్గడంతో బాలయ్య చాలా ఫైర్ అయ్యాడట . అంతేకాదు ఈ సినిమా ఎవరితో చేసిన ఫ్లాప్ అవుతుంది అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారట . అయితే అప్పట్లో ఆ విషయాన్ని లైట్ తీసుకున్న తేజ ..తర్వాత దగ్గుబాటి అభిరామ్ ను ఇంటృఅడ్యూస్ చేయడానికి ఈ కథను వాడుకున్నాడు. ఫైనల్లి దగ్గుబాటి అభిరాం ఫ్లాప్ అయ్యాడు. దీంతో బాలకృష్ణ సైతం నా కొడుకు బ్రతికిపోయాడు .. సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు అంటూ సంబరపడిపోయారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే అహింస లాంటి కథను సురేష్ బాబు విని కూడా అభిరామ్ దగ్గర చేయించడం ఏంటో ఆయనకే తెలియాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!