ఏ టాలీవుడ్ హీరో చరపలేని రికార్డును సృష్టించిన ప్రభాస్..!!

టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇటీవలె ఆది పురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి వీకెండ్ రూ.340 కోట్లకు పైగా రాబట్టి ఒక సెన్సేషనల్ ని క్రియేట్ చేస్తోంది. అయితే నిన్నటి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు భారీగా డ్రా అయినట్లుగా తెలుస్తోంది. కేవలం సోమవారం ఒక్కరోజే రూ .35 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ సరికొత్త సినిమాలు విడుదల కాబోతున్న తరుణంలో ఆది పురుష్ సినిమా హవా తగ్గిపోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

A farmhouse? Prabhas buys new a property near Hyderabad

అయితే ప్రభాస్ నటించిన చిత్రాలలో ఇప్పటివరకు సెంచరీ కొట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో కూడా రికార్డు నెలకొనపలేదు. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 , సాహో చిత్రాలు రూ .300 కోట్ల క్లబ్లో చేరాయి.. రాధే శ్యామ్ చిత్రం మాత్రం రూ.214 కోట్ల వద్ది నిలిచిపోయింది కానీ ఆది పురుష్ చిత్రం మాత్రం రూ.300 కోట్ల లిస్టులో చేరిపోయింది. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో కూడా నాలుగు సినిమాలతో రూ.300 కోట్ల రూపాయలు రాబట్టిన ఘనత సాధించలేదు..

ఓవరాల్ గా రూ.100 కోట్లు రాబట్టడమే గగనం అనుకుంటున్న బడా హీరోలకు ప్రభాస్ మాత్రం రూ .100 కోట్లు కొల్లగొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న తదుపరి సినిమాల విషయానికే వస్తే సలార్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ -K తదితర చిత్రాలలో నటిస్తున్నారు. ఈ చిత్రాలు కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తాయని అభిమానులు భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రభాస్ రికార్డులను ఏ హీరో బద్దలు కొడతారో చూడాలి మరి.