ఎస్.. కృతి శెట్టి అభిమానులకు రాకూడని డౌట్ వచ్చింది . నిజంగా ఇది కృతశెట్టికి దారుణాతి దారుణమైన ఇన్సల్ట్ అనే చెప్పాలి. లేకపోతే వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలను అందున్నాక కూడా కృతశెట్టి నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఆమె ఫ్యాన్స ఆమెను నిందిస్తున్నారు . అనుమానిస్తున్నారా..? ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో యమ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి .
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమా ద్వారా వచ్చి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారి ఇండస్ట్రీ లెక్కలు మార్చేసిన కృతిశెట్టి ప్రజెంట్ టఫ్ సిచువేషన్ లో ఉంది. మొదటి మూడు సినిమాలు ఏ రేంజ్ లో హీట్ అయ్యాయో ఆ తర్వాత తీసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోని కృటిశెట్టికి తెలుగులో అవకాశాలు ఇవ్వడానికి డైరెక్టర్ లు ముందుకు రావడం లేదు.
తమిళ్ లో మాత్రం అరాకొరా అవకాశాలతో ముందుకు వెళ్తుంది . ఈ క్రమంలోనే కొందరు జనాలు నిజంగా కృతశెట్టికి స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఆమెలో నటించే సత్తా ఉందా..? కేవలం అదృష్టం తో ఇన్నాళ్లు ఇండస్ట్రీలో రానిచ్చిందా..? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . దీంతో కృతి శెట్టి ఫాన్స్ కి ఇలాంటి డౌట్లు వచ్చాయంటే మిగతా అభిమానులు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. దీనితో కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!