సమ్మర్‌లో బొక్క బోర్ల పడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీ.. అన్నీ ఫ్లాపులే!

ఈసారి సమ్మర్ సీజన్‌లో వచ్చిన సినిమాలేవీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. భారీ అంచనాలు నడుము విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. మొదటి వారంలో విడుదలైన ఉగ్ర, రామ బాణం సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇక అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘కస్టడీ’ సినిమా కూడా పరాజయం పాలయింది. పాతిక కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నందిని రెడ్డి సినిమా ‘అన్ని మంచి శకునములే’ కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది.

మే నెలలో వచ్చి కాస్తో కుస్తో మంచి టాక్ తెచ్చుకున్న ఒకే ఒక సినిమా ‘మేము ఫేమస్ ‘. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టకపోయినా, ఎంతో కొంత కలెక్షన్లు అయితే రాబట్టింది. ఇక ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన ‘మళ్లీ పెళ్లి ‘ సినిమాకి చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఆ హంగామా వల్ల ప్రేక్షకుల సినిమా చూడాలని థియేటర్స్ వరకూ వెళ్లారు కానీ మధ్యలోనే బోర్ కొట్టి బయటికి వచ్చిన పరిస్థితులు కనపడుతున్నాయి.

టాలీవుడ్ సినిమా సంగతి పక్కన పెడితే, డబ్బింగ్ సినిమాలు మాత్రం మంచి పేరు టాక్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచాయి. మే నెల రెండవ వారంలో విడుదల అయిన ‘ది కేరళ స్టోరీ ‘ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఎన్నో విమర్శలు ఫేస్ చేసిన ఈ సినిమా చూసేందుకు చాలా మంది సినీ ప్రేక్షకులు మొగ్గు చూపించారు .

ఇక మూడవ వారం లో విడుదల అయిన బిచ్చగాడు 2 మొదటి రోజే నాలుగు కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. బిచ్చగాడు సినిమా బాగుండటంతో పార్ట్ 2 పై ప్రేక్షకులు బాగా చూశారు. అయితే మన తెలుగు సినిమాల కంటే కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. చెప్పాలంటే తమిళంలో కంటే ఎక్కువగా తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇక గతవారం రిలీజ్ అయిన ‘2018 ‘ సినిమా బాక్సఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మొదటిరోజే కొట్టి కి పైగా వసూలు చేసి గత వారం రిలీజ్ అయిన తెలుగు సినిమాలను దాటేసింది.

2018 సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు మూడు కోట్ల పైగా లాభాలు అందుకున్నారు. ఈవారం కూడా పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు కాబట్టి ఈ సినిమాకి బాగా కలిసి వస్తుంది. అయితే 2018 సినిమా వచ్చేవారం ఓటీడీలో రిలీజ్ కాబోతుంది. డిస్ట్రిబ్యూటర్లకు ఇదొక చేదు అతని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఈసారి సమ్మర్ లో మన టాలీవుడ్ సినిమాలు కంటే డబ్బింగ్ సినిమాలే మంచి కలెక్షన్లు రాబట్టాయి.