తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. కస్టడీ సినిమాని తెలుగు, తమిళ భాషలో మే 12 న విడుదల చేయబోతున్నారు. నాగచైతన్య తమిళ పరిశ్రమకి పరిచయం కానున్న మొదటి సినిమా కాబట్టి అక్కడ ప్రమోషన్స్ బాగానే జరుగుతున్నాయి.
తాజాగా తెలుగు మీడియాతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకట్ ప్రభు మాట్లాడారు. వెంకట్ ప్రభు సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘కస్టడీ సినిమా కథ కరోనా సమయంలో వచ్చింది. మలయాళ సినిమా ‘నాయట్టు’ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను ఈ కథ రాసాను. అయితే నాయట్టు సినిమాలో లేని కొన్ని కమెర్షియల్ సీన్స్‌ను కస్టడీలో జోడించాను’ అని వెంకట్ చెప్పారు.
‘ఒక సాధారణ కానిస్టేబుల్ పెద్ద ఆశయాలతో ముందుకు వెళ్ళాలి అనుకోవడమే సినిమా కథ. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా లో ఒక సాంగ్ చూసాను. అప్పుడే ఫిక్స్ అయ్యాను నా కథకు నాగచైతన్య మాత్రమే సెట్ అవుతాడని ఫిక్స్ అయ్యాను. వెంటనే కస్టడీ స్టోరీని చైతూకి చెప్పాను. నాగచైతన్యకి కూడా కథ నచ్చడంతో ఒకే చెప్పారు’ అని వెంకట్ ప్రభు అన్నారు. అక్కినేని అభిమానులు ‘కస్టడీ’ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఇకపోతే కస్టడీ సినిమాలో భాగంగా నాగచైతన్య సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. విడాకుల తర్వాత చైతు సమంత గురించి మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. అలాగే అతని అప్‌కమింగ్ మూవీ గురించి చాలామందికి తెలుసొచ్చింది.