SR. ఎన్టీఆర్ పై ఫైర్ అయినా కరాటే కళ్యాణి..!!

టాలీవుడ్ లో నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈమె ఈ మధ్యకాలంలో పలు వివాదాలలో నిలుస్తూనే ఉంది.అందులో భాగంగానే మరొక వివాదంలో తాజాగా వేలు పెట్టింది కరాటే కళ్యాణి. మొన్నటి వరకు హిందూ మత పరిరక్షణ పేరుతో సోషల్ మీడియా వేదిక మతవిద్వేషాలని రెచ్చగొడుతూ క్రిస్టియన్, ముస్లిం మతాల పైన విరుచుకు పడింది కరాటే కళ్యాణి.

ఇప్పుడు యాదవుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలుగా చెప్పుకునే ఈమె సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలు వివాదకరమైన పోస్టులను షేర్ చేసింది. శ్రీకృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెడితే ఊరుకోమంటూ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు హెచ్చరించారు.

శ్రీకృష్ణుని రూపంలో ఉన్న విగ్రహం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయబోతుండగా మీడియా సమావేశం నిర్వహించిన మేకల రామూల యాదవ్ యాదవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నారని.. శ్రీకృష్ణుని రూపంలో సినీ నటుడు విగ్రహాలను పెడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించడం జరిగింది. వీటిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ ఎన్టీఆర్ పైన పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది.

ఎన్టీఆర్ అంటే అభిమానం ఉండవచ్చు కానీ ఆయన రూపురేఖలతో విగ్రహాలు పెడితే ఊరుకునేది లేదంటూ శ్రీకృష్ణ పరమాత్మ కి ప్రత్యేకమైన రూపంలో విగ్రహాలు చేయించండి ఎన్టీఆర్ గొప్ప నటుడే కావచ్చు కానీ శ్రీకృష్ణుని అంతా పరమాత్మను లాగా విగ్రహాలను తయారు చేయించడం మంచిది కాదంటూ.. ఇలాగే వదిలేస్తే రేపటి రోజున శివుడు అనగానే ఎన్టీఆర్ను చిరంజీవిని అలా ఊహించుకొని విగ్రహాలు పెట్టేస్తారా ఫ్యూచర్లో ఇవే విగ్రహాలు మేము చూడాలా.. అంటూ ఫైర్ అవుతోంది. ఇలాంటివన్నీ మా మనోభావాలు దెబ్బతీసేలా కనిపిస్తున్నాయని తెలుపుతోంది కరాటే కళ్యాణి.

Share post:

Latest