సీనియర్ స్టార్ హీరోయిన్ మాధవి ఆ కారణంగానే సినిమాలకు దూరమైందా.. అందుకే విదేశాల నుంచి రావట్లేదా..!

సినీ పరిశ్రమకు కనక మహాలక్ష్మి గా వచ్చింది..అటు తరువాత మాధవిగా పేరు మార్చుకుని వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. హిట్‌లు మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ‘ఖైదీ’ సినిమాలో ‘రగులుతుంది మొగలిపొద’ వంటి హాట్ సాంగ్లో హాట్ హాట్ స్టెప్పులు వేసిన ఈ అమ్మడిని చూసి అప్పటి స్టార్ హీరోయిన్లు అంతా వణికిపోయారు.ఆ ఒక్క సినిమాతో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

ചിത്രം ആകാശദൂതില്‍ വേഷമിട്ട നടി മാധവി ഇപ്പോള്‍ എവിടെയാണെന്ന് അറിയുമോ ? -  Mixindia

తెలుగు ,తమిళ్ , మలయాళం , కన్నడ , హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది మాధవి. రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , డాక్టర్ రాజశేఖర్ తదితర హీరోల సరసన నటించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తో ఎక్కువ సినిమాలు చేసింది. దొంగమొగుడు , ఖైదీ , ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య కోతల రాయుడు , ప్రాణం ఖరీదు , కుక్కకాటుకు చెప్పు దెబ్బ , ఊరికిచ్చిన మాట ,మొండిఘటం , రోషగాడు , సింహాపురి సింహం , చట్టంతో పోరాటం తదితర చిత్రాల్లో నటించింది.

വെള്ളാരം കണ്ണുള്ള സുന്ദരി മാധവി ഇപ്പോള്‍ എവിടെ? | Cinema, General, Latest  News, Mollywood, Movie Gossips, NEWS, WOODs , Malayalam, Malayalam cinema,  Movie

80 వ దశకంలో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది. ఆ జనరేషన్ హీరోయిన్స్ చాలామంది ఇప్పుడు మళ్ళీ మొహానికి రంగేసుకొని అమ్మ, వదిన పాత్రలలో కనువిందు చేస్తున్నారు. కానీ, ఇండస్ట్రీలో ఉన్న దర్శకనిర్మాతలతో హీరోలతో మంచి అనుబంధం ఉన్న మాధవీ మాత్రం తెర మరుగైపోయారు. కారణం తను కెరీర్‌ను పూర్తిగా తన కుటుంబానికి అంకితం చేయడమే. ఇదే మాట ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.

Senior actress Madhavi with family latest photos | Madhavi family | Gup  Chup Masthi - YouTube

కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా అందుబాటులో లేరు. విదేశాలలో సెటిలయ్యారు. నటన కావాలంటే మళ్ళీ తను హైదరాబ్ద్ రావాల్సి ఉంటుంది. ఇప్పట్లో అది కుదరని పని. పైగా మాధవిని ఎవరూ సంప్రదించలేదనే టాక్ కూడా ఓ వైపు వినిపిస్తుంది. అందుకే, ఆమె మిగతా సీనియర్ నటీమణుల మాదిరిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం లేదు.

Share post:

Latest