మరొకసారి సంచలన పోస్ట్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. 2016 లో శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇది ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా వీరు దూరంగా ఉంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అవుతూ విడివిడిగా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటున్నారు.

Amid Rumors, 'Sreeja Kalyan' Turns 'Sreeja Konidela'
ముఖ్యంగా తమ రిలేషన్షిప్ పై ఇండైరెక్టర్గా హింట్ ఇస్తూ ఉన్నారు. తాజాగా కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన మరొక పోస్ట్ ఇద్దరు సపరేట్ అయ్యారని విషయాన్ని అర్థమయ్యేలా చేస్తోంది ముఖ్యంగా పిల్లలు మాత్రం తమకు దూరమయ్యారని విషయం స్పష్టంగా తెలియజేస్తోంది. కళ్యాణ్ దేవ్ కూతురు నవిస్క శ్రీజవద్దే పెరుగుతోంది.. కానీ ఆ పాపని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ పెడుతూ ఉంటారు. కళ్యాణ్ దేవ్ తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఒక పాప స్కూల్ కల్చరల్ లో పాల్గొంటుంది. వేడుక ముందున్న పేరెంట్స్ ని చూసి ఆమె చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది ఈ వీడియోని కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కామెంట్ కూడా పెట్టారు పిల్లలకు తల్లితండ్రులు ఇద్దరు ప్రేమ కావాలి.. నవిస్క, నవృతిలను చాలా మిస్ అవుతున్నానని కళ్యాణ్ దేవ్ కామెంట్ పెట్టాడు. నవిస్క శ్రీజ కళ్యాణ్దేవులకు పుట్టిన అమ్మాయి.. నవ్రితి మాత్రం శ్రీజ మొదటి భర్త సంతానం. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest