బిచ్చగాడిగా మ‌హేష్ బాగా సెట్ అవుతాడు.. హాట్ టాపిక్ గా మారిన‌ స్టార్ హీరో కామెంట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన `బిచ్చగాడు` సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2016లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఇందులో బిచ్చ‌గాడిగా విజ‌య్ న‌ట‌న అద్భుతం అనే చెప్పాడు.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చ‌గాడు 2` రాబోతోంది. హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మే 19న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాడు. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో మేక‌ర్స్ మ‌రింత హైప్ పెంచుతున్నారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా విజ‌య్ ఆంటోనీ తాజాగా తెలుగు మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యాడు.

ఈ సంద‌ర్భంగా మీడియా వారు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే ఓ రిపోర్ట‌ర్‌.. బిచ్చగాడులో మీకు బ‌దులుగా టాలీవుడ్ లో ఏ హీరో సరిపోతాడు అని ప్రశ్నించగా.. మహేష్‌ బాబు బాగా సెట్ అవుతాడు అంటూ విజ‌య్ వెల్ల‌డించారు. అలాగే త‌మిళంలో విజయ్ లేదా అజిత్ అయితే ఈ క్యారెక్టర్ కు సూట్ అవుతార‌ని తెలిపాడు. దీంతో విజ‌య్ ఆంటోనీ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. మ‌హేష్ ఫ్యాన్స్ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. కొంద‌రైతే `బిచ్చ‌గాడిగా మ‌హేషా.. బాబోయ్ ఆ ఊహే భ‌రించ‌లేము` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest