1,2 కాదు ఏకంగా మూడు.. బాలయ్య అభిమానులకు కాలర్ ఎగరేసే న్యూస్ ఇది.. పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పేరు సంపాదించుకున్న బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . కాగా ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న బాలకృష్ణ రీసెంట్ గానే వీర సింహారెడ్డి అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ సినిమాలపై కూడా అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు . కాగా ప్రెసెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న బాలయ్య.. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 తీయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ జూన్ 10వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారట . అంతేకాదు అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన టైటిల్ , టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట . అంతేనా ముచ్చటగా మూడు అప్డేట్స్ ఇవ్వడానికి బాలయ్య సిద్ధపడినట్లు తెలుస్తుంది . ఈ రెండు అప్డేట్స్ కాకుండా బాలకృష్ణ ఎంతో బాలకృష్ణ కెరియర్ లో ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ” నరసింహనాయుడు” సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లోనే గుర్తుండిపోయిన “నరసింహనాయుడు” సినిమాను రి రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా 105 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుని రికార్డ్ సృష్టించిన “నరసింహనాయుడు” సినిమా రిలీజ్ చేస్తే కచ్చితంగా అందుకు డబల్ రేంజ్ లో రికార్డులను కొల్లగొడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. ఈ క్రమంలోని అభిమానుల కోసం బాలయ్య 3 గిఫ్ట్లను రెడీ చేశాడు అని.. ఖచ్చితంగా ఈ బర్త్ డే బాలయ్య అభిమానులకు గుర్తు ఉండిపోతుంది అంటూ సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు ..!!

Share post:

Latest