డింపుల్ హైయతి ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు.. చివరికి ఏం జరిగిందంటే..

హీరోయిన్ డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తార ఖిలాడి, రామాబాణం లాంటి సినిమాలలో నటించింది. కానీ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. డింపుల్ హయతి హైదరాబాద్‌లో జర్నలిస్ట్ కాలనీలోనే ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఇంట్లో ఒక సంఘటన చోటు చేసుకుంది.

ఇంతకుముందు హయతికి, ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డేకి మధ్య జరిగిన వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్లేస్ లో డింపుల్ హయతి, రాహుల్ హెగ్డే కారుని కాలితో తన్నిందని, చాలా దురుసుగా ప్రవర్తించిందని రాహుల్ కార్ డ్రైవర్ కేసు నమోదు చేశాడు. దాంతో ఈ విషయం వివాదంగా మారింది. అయితే డింపుల్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, అమ్మాయిని కాబట్టి తన పైన లేనిపోని నిందలు వేస్తు కావాలనే ఆమెని టార్గెట్ చేసారు అంటూ వాదించింది హయతి. ఇక ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఆ సంఘటన నుంచి బయటకు రాకముందు హయతి ఇంట్లో మరో కొత్త సంఘటన చోటు చేసుకుంది.

జర్నలిస్ట్ కాలనీలోని అపార్ట్‌మెంట్ నివాసం ఉంటున్న డింపుల్ హయతి ఇంట్లోకి ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పనిమనిషి ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేసింది. డింపుల్ ఇంట్లో ఉన్న కుక్క కూడా ఆ అపరిచుతులను లిఫ్ట్ వరకూ తరుముతూ వెళ్ళింది. వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యడంతో, జూబ్లీహిల్స్ పోలీస్‌లు హయతి ఉండే అపార్ట్మెంట్ కి వచ్చి ఆ ఇద్దరు వ్యక్తిలను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు రాజమండ్రి కి చెందిన సాయిబాబా, శృతి లుగా గుర్తించారు. అయితే వారిద్దరూ డింపుల్ హయతి ఫ్యాన్స్ అని ఆమె ఇటీవలే వివాదాలలో చిక్కుకుంది కాబట్టి పరామర్శించడానికి వచ్చినట్లు తెలిపారు. దాంతో ఆ విషయాన్ని హయతికి చెప్పి వారిని విడిచిపెట్టినట్లు తెలుస్తుంది.

 

Share post:

Latest