ఎన్టీఆర్ బయోపిక్ పై మనసులో కోరిక బయటపెట్టిన తేజ..!

ప్రముఖ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటకు పెట్టి ముక్కు సూటిగా మాట్లాడే డైరెక్టర్లలో తేజ కూడా ఒకరు. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఏ విషయాన్ని అయినా సరే తనకు తోచినట్లుగా నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే చాలా రోజుల తర్వాత దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అహింసా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా జూన్ రెండవ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ తన మనసులో మాటలను కూడా బయటపెడుతున్నారు తేజ.

I Will Make NTR Biopic With That Nandamuri Hero Says Director Teja

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. గతంలో కూడా ఈ సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే ముహూర్తం కూడా ప్రారంభించి..ఆ తర్వాత సినిమాను క్యాన్సిల్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణతో విభేదాల వల్లే సినిమా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ విషయంపై మరొకసారి తేజ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో ఏ విధమైనటువంటి గొడవలు లేవు అని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నుంచి తప్పుకోవడానికి కూడా కారణం ఉంది.. అలాంటి ఒక మహనీయుడు బయోపిక్ సినిమా చేసే సత్తా తనకు లేదని అందుకే అప్పుడు తాను తప్పుకున్నానని.. కానీ ఎప్పటికైనా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని.. అది కూడా వెబ్ సిరీస్ గా చేస్తానని అందులో తారక్ హీరోగా ఉండేలా చూసుకుంటాను అంటూ ఈ సందర్భంగా తేజ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు ఇక పండగే అని చెప్పవచ్చు.

Share post:

Latest