మెగా డాటర్ నిహారిక తరచూ ఈ మధ్యకాలంలో తెగ వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా తన భర్త చైతన్యతో విడిపోతోంది అంటూ పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. అంతే కాకుండా తాజాగా తన అన్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో వివాహం జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున పలు రూమర్సు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా నిశ్చితార్థం కూడా అయిపోయింది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గతంలో కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలు రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.
గతంలో లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా బెంగళూరులో తన స్నేహితులతో పార్టీ చేసుకోగా ఆ పార్టీలో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు వీరి ప్రేమ పెళ్లి ఎంగేజ్మెంట్ వార్తల పైన ఇటు మెగా ఫ్యామిలీ కానీ లావణ్య త్రిపాఠి కుటుంబం కానీ స్పందించలేదు. తాజాగా ఈ వార్తలపై వరుణ్ తేజ్ చెల్లెలు మెగ డాక్టర్ నిహారిక స్పందించడం జరిగింది. డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న నిహారిక ఈ సిరీస్ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిహారిక కు ఈ ప్రశ్న ఎదురవ్వడం జరిగింది.
అయితే తన వెబ్ సిరీస్ కంటే వరుణ్ తేజ్ పెళ్లి ప్రశ్నలు ఎక్కువగా రావడంతో నిహారిక కాస్త అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై మాట్లాడడానికి ఆమె ఇష్టపడడం లేదట. తను కేవలం వెబ్ సిరీస్ గురించి మాత్రమే మాట్లాడడానికి వచ్చానని చెప్పడం గమనార్హం. దీంతో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు నిజమా కాదా అనే సందేహాలు మొదలవుతున్నాయి. నిహారిక లావణ్య ఇద్దరు మంచి స్నేహితులే.. మరి ఈ విషయానికి ఎవరూ పుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.