ఎట్టకేలకు తనపై వస్తున్న రూమర్ పై స్పందించిన హన్సిక..!!

హీరోయిన్ హన్సిక కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు దేశముదురు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హాన్సిక ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఇప్పటివరకు 50 కి పైగా సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ్ హిందీ భాషలలో రాణించింది అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీలు మాదిరిగానే హన్సిక కూడా ఎన్నో రకాల ట్రోల్స్ కి గురైంది.

Hansika Motwani - Wikipedia
తాజాగా తన మీద వస్తున్న కొన్ని రూమర్ల పైన స్పందించింది హన్సిక.. తాను త్వరగా ఎదిగేందుకు తన తల్లి గ్రోతింగ్ హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి .ఇంజక్షన్ వల్లనే తాను పెద్దదిగా కనిపించానని మీడియా ప్రచారం చేసిందని తెలియజేసింది.హన్సిక లవ్ షాది డ్రామాలో తల్లి, కూతురు గతంలో దీని గురించి మాట్లాడారు.. హన్సిక తల్లి మాట్లాడితే హన్సిక కెరియర్ ప్రారంభంలో తనను చాలా బాధపెట్టిన ప్రచారం ఇదని తెలిపింది.తన కుమార్తె ఎదగడానికి ఇంజక్షన్లు ఇచ్చామని తనపైన ఆరోపణలు వచ్చాయి ఆ ఇంజక్షన్ ఏమిటో చెప్పండి నేను టాటా బిర్లా కంటే ధనవంతురాలిన ఏ తల్లి ఇలాంటి పని చేయగలదు మీరే చెప్పండి అంటూ.. చెప్పడమే కాకుండా ఎముకలను పెంచే ఇంజక్షన్ ఉన్నాయా చెప్పండి అంటూ తన ఆవేదనను తెలియజేసింది.

हंसिका मोटवानी जीवनी Hanshika Motwani biography in Hindi - mrDustBin
హన్సిక మాట్లాడితూ సెలబ్రిటీల జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటికి సిద్ధంగా ఉండాలి సోషల్ మీడియా ప్రజాధారణ పొందక ముందే నాపై ఇలాంటి దుష్ప్రచారం జరిగింది
కాబట్టి చాలా విషయాలు ఎవరికీ తెలియని తెలిపింది. నేను ఎలాంటి విషయాన్ని దాచాలని ప్రయత్నించడం లేదు అందుకోసమే ఒక వెబ్ సిరీస్లో తన సంబంధించిన విషయాలని తెలియజేశానని తెలిపింది. ముఖ్యంగా తనకు సూదులు అంటే భయము పచ్చబొట్టు కూడా వేయించుకోలేకపోయాను అంటూ తెలియజేసింది.

Share post:

Latest