డ‌బుల్ హ్యాపీనెస్‌లో త‌మ‌న్నా.. తేడా వ‌స్తే పాపను ఉతికారేస్తారు!

సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ బిజీ బ్యూటీగా సత్తా చాటుతున్న తమన్నా ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ లో ఉందట. అందుకు కారణం లేకపోలేదు. తమన్నా ప్రస్తుతం నటిస్తున్న రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి. అందులో `జైల‌ర్‌` ఒక‌టి.

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కు మొద‌టిసారి జోడీగా త‌మ‌న్నా చేస్తున్న చిత్ర‌మిది. నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఆగ‌స్టు 10న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే త‌మ‌న్నా మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేస్తుంది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు ఇది రీమేక్.

ఇందులో చిరంజీవికి సోదరి పాత్రలో కీర్తి సురేష్ అలరించబోతోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతోంది. తమన్నా నటించిన రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవ్వడం ఆమె కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే ఆమె ఫుల్ హ్యాపీగా, ఎగ్జైట్‌గా ఉంద‌ట‌. అయితే ఈ రెండు చిత్రాల్లో ఏ ఒక్క సినిమా ఫలితం తేడా కొట్టిన తమన్నాను ఆయా హీరో అభిమానులు ఊతికారేస్తారు అన‌డంలో సందేహం లేదు. మ‌రి త‌మ‌న్నా ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్స్‌కు హిట్ అందిస్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Share post:

Latest