పెళ్లిపై స‌దా సంచ‌ల‌న కామెంట్స్‌.. ఉన్న‌ట్లుండి ఇంత పెద్ద షాకిచ్చిందేంటి?

తెలుగు, తమిళ భాషలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ సదా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో సదాకు ఊహించని షాక్ తగిలింది. ఆమె తల్లి క్యాన్సర్ పారిన పడింది. దాంతో తల్లిని చూసుకుంటూ సదా కెరీర్ ను పక్కన పెట్టేసింది. దాంతో ఆఫర్లు తగ్గిపోయాయి.

సదా ఫేడౌట్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. కొన్నాళ్లకు సెకెండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సరే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తుంది. అయితే నాలుగు పదుల వయసు వచ్చిన ఈ అమ్మడు మాత్రం పెళ్లి ఊసు ఎత్తడం లేదు. పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది.

అయితే తాజాగా సదా పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. `మన జీవితాల్లో కొందరిని దూరంగానే ఉంచాలి. జీవితం చాలా చిన్నది. బలవంతంగా బంధాల్లో ఉండటం కంటే.. ఒంటరిగానే ఉండటం మంచిది` అంటూ కామెంట్స్ చేసింది. ప‌రోక్షంగా తాను ఒంటిరిగానే ఉంటాను అంటూ కుండబ‌ద్ద‌లు కొట్టి ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చింది. దీంతో స‌దా కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest