ఈ మధ్యకాలంలో సినిమా స్టోరీ బాగుందనిపిస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు దర్శకనిర్మాతలు నటీనటులు సైతం.. ఒకప్పుడు అయితే ఇక్కడ హీరోతో చేసిన సినిమా కథను ఇతర భాషలలో వేరే హీరోతో చేసేవారు. అలాంటి పరిస్థితులలో కూడా భారీ విజయాన్ని అందుకున్న చిత్రంలో గజిని సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలలో కూడా మంచి విజయాన్ని అందుకుంది.
హీరో సూర్యను సరికొత్తగా చూపించి ప్రేక్షకులకు సరికొత్త ప్రేమ కథను అందించారు. ఇప్పుడు ఈ సినిమా గురించి సూర్య మురుగదాస్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఈ సినిమా సీక్వెల్ ఆలోచనలో టాలీవుడ్ బాలీవుడ్ మధ్య ఎక్కువగా తిరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా సీక్వెల్లో నటుడు సూర్య కాకుండా అమీర్ ఖాన్ తో చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో కూడా బాలీవుడ్ లో గజినీ సినిమాలో అమీర్ ఖాన్ నటించారు.
సూర్య, అమీర్ ఖాన్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ క్లాసికల్ సినిమాగా పేరుపొందిన గజిని సినిమా.. సీక్వెల్ లో మురగదాస్ డైరెక్టర్గా అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో ఈ సినిమా మొదలవుబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవలే మురగదాస్, అమీర్ ఖాన్, అల్లు అరవింద్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా లాల్ సింగ్ చెడ్డ సినిమాలో నటించారు అమీర్ ఖాన్.. దీంతో తన తదుపరి చిత్రాన్ని గజినీ-2 తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.