కర్నూలుపై లోకేష్ ఫోకస్..టీడీపీ స్వీప్ అయ్యేలా..కానీ.!

ఓ వైపు పాదయాత్ర చేస్తూనే..మరోవైపు పార్టీని బలోపేతం చేసే అంశంపై లోకేష్ ఫోకస్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా అన్నీ వర్గాల ప్రజలని కలుస్తూ వస్తున్న లోకేష్..అందరి సమస్యలు తెలుసుకుంటూ..ప్రజా మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు. అలాగే వైసీపీకి కీలకమైన స్థానాల్లో టి‌డి‌పికి పట్టు పెరిగేలా లోకేష్ స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

కర్నూలు అంటే వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్కడ వైసీపీకి 14కి 14 సీట్లు గెలుచుకుంది. కానీ ఈ సారి వైసీపీకి చెక్ పెట్టి టి‌డి‌పి సత్తా చాటేలా చేయాలని అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీకి 14 సీట్లు ఇచ్చిన సరే జిల్లాకు ఏం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. పెద్దగా అభివృద్ధి జరగలేదని సొంత పార్టీ నేతలే మాట్లాడుకునే పరిస్తితి. ఈ క్రమంలోనే లోకేష్..కర్నూలు ప్రజలని ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. 2014 ఎన్నికల్లో జిల్లాలో టి‌డి‌పికి 3 సీట్లే ఇచ్చారని, అయినా అప్పుడు మంచిగా అభివృద్ధి చేశామని, 3 సీట్లే ఇస్తేనే బాగా పనిచేశామని..ఇప్పుడు 14 సీట్లు ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.

వాస్తవానికి లోకేష్ చెప్పిన మాటల్లో కాస్త వాస్తవం ఉంది..2014లో టి‌డి‌పికి 3 సీట్లే వచ్చాయి..అప్పుడు అధికారంలోకి వచ్చి..జిల్లాలో కాస్త అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ వైసీపీకి 14 సీట్లు ఇచ్చిన ఆ మేర అభివృద్ధి జరగడం లేదు. అందుకే ఇప్పుడు తమకు 14 సీట్లు ఇవ్వాలని లోకేష్ కోరుతున్నారు. కానీ కర్నూలులో టి‌డి‌పి స్వీప్ చేయడం జరిగే పని కాదు..ఇప్పటికీ అక్కడ వైసీపీకే లీడ్ ఉంది.