ఆంధ్రప్రదేశ్లోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాల వైపు చాలా బిజీగా ఉన్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చూస్తూ ఉంటే..తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చారనే విషయం తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హాట్ టాపిక్ గా మారేలా చేస్తోంది.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు సీఎం పదవిని డిమాండ్ చేసే అంత స్టామినా లేదంటు క్లారిటీ ఇచ్చారు. ఎవరేమన్న కాదన్నా ఏపీ రాజకీయాలలో కాపుల రిప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మెజారిటీతో గెలుస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ దూరం చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కోసం ఎంత చేసినా కూడా ఇతరులకి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ సైతం పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు ఇది అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వర్మ తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు.
కాపుల్ని అభిమానుల్ని దారుణంగా వెన్నుపోటు పొడిచారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ తెలిపారు రాంగోపాల్ వర్మ.. అటు పొత్తుల విషయంలోను పవన్ క్లారిటీ ఇచ్చారు జగన్ గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కచ్చితంగా పొత్తుల కోసం ప్రయత్నాలు ఉంటాయని తెలుస్తోంది.. ఒత్తులు లేకుండా ముందుకు వెళ్లలేమంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ప్రతిపక్షాల ఓటమి మరొకసారి జగన్ విజయం ఖాయమైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంబంధించి క్లారిటీగా విషయమైతే వచ్చింది.. మరి పవన్ కళ్యాణ్ బిజెపి ,టిడిపి, టిడిపి కమ్యూనిస్టులతో కలుపుకొని వెళ్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.
తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు. https://t.co/YqSzrhuPHX
— Ram Gopal Varma (@RGVzoomin) May 11, 2023