స్టార్ హీరో ఇంటికి కోడ‌లు కాబోతున్న సుమన్ కూతురు.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా?

90ల్లో వెండితెరను ఏలిన హీరో సుమ‌న్‌.. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఓ కేసులో ఇరుక్కుని జైలు పాల‌య్యారు. సుమ‌న్ ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోయినా.. ఆయ‌న కొద్ది రోజులు జైలు శిక్ష‌ను అనుభ‌వించారు. చివ‌రకు ఆ కేసులో నిర్దోషిగా విడుద‌ల అయ్యారు. ఆ త‌ర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దాంతో విల‌న్ గా మారారు.

అలాగే స‌హాయ‌క పాత్ర‌ల‌ను కూడా పోషిస్తూ.. నాలుగు ద‌శాబ్దాల నుంచి ఇండ‌స్ట్రీలో న‌టుడిగా స‌త్తా చాటుతున్నారు. ఇక సుమ‌న్ వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. సీనియర్ రైటర్ డీవీ నరసరాజు మనుమరాలు శిరీషను సుమన్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు అఖిలజ ప్రత్యూక్ష ఉంది. హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. నృత్య కళాకారిణి అయిన ఆమె ఎన్నో స్టేజీ షోలు చేసింది.

రవీంధ్రభారతిలో ఎంతో మంది కళాకారుల ఎదుట ప్రదర్శించిన అఖిలజ ప్రత్యూక్ష అనేక అవార్డులు, రివార్డులు అందుకుంది.ఈ క్ర‌మంలోనే ఆమెకు అనేక సినిమాల్లో హీరోయిన్‌గా ఆఫ‌ర్లు వ‌చ్చినా.. అఖిల‌జ మాత్రం ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే అఖిలజ ప్రత్యూష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ని.. సౌత్‌లోని ఓ స్టార్ హీరో ఇంటికి ఆమె కోడలు కాబోతోంద‌ని ప్రచారం జరుగుతుంది. ఈ విష‌యంపై తాజాగా సుమ‌న్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. `మా అమ్మాయి అఖిలజ హ్యూమన్ సౌత్ ఇండియాలోని స్టార్ హీరో ఇంటికి కోడ‌లు కాబోతోంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదు. మా అమ్మాయి పెళ్లి ఎవ‌రితోనూ కూద‌ర్లేదు. ఆమె మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనెటిక్స్ పూర్తి చేసింది. ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది. చదువు పూర్తి అయ్యాక పెళ్లి చేస్తాను` అని సుమ‌న్ పేర్కొన్నారు.

Share post:

Latest