రికార్డు ధ‌ర ప‌లికిన `పుష్ప 2` ఆడియో రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్ట‌ర్ సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్‌ ఎంతటి సంచలన విజయాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప ది రూల్‌` టైటిల్ తో పార్ట్ 2ను తెర‌కెక్కిస్తున్నారు. రష్మిక ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది.

ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి ఈ చిత్రం వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకముందే పుష్ప 2 బిజినెస్ ప్రారంభం అయింది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ ను మేకర్స్ రికార్డ్ ధరకు విక్రయించారని ఓ టాక్ బయటకు వచ్చింది.

పుష్ప 2 ఆడియో రైట్స్‌ ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాయో తెలిస్తే కళ్ళు తేలేస్తారు. టి సిరీస్ సంస్థ ఈ సినిమా ఆడియో హ‌క్కుల‌ను ఏకంగా రూ. 65 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆడియో హక్కుల ప‌రంగా అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన చిత్రాల్లో పుష్ప 2 ఇండియన్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే టాప్ ప్లేస్ లో నిలిచింది.

Share post:

Latest