చిరంజీవితో నటించాలనే కోరిక ఉండిపోయింది, ఎప్పుడు తీరుతుందో: ప్రియమణి

మెగాస్టార్ చిరంజీవి… ఈపేరు తెలియనివారు దాదాపుగా ఇండియాలోనే ఎవరూ వుండరు. చిరంజీవి అంటేనే ఓ ప్రభంజనం. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఇష్టపడే నటుడు ఎవరన్నా వున్నారంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే. అలాంటి మెగాస్టార్ పక్కన నటించాలని ఎవరూ అనుకోరు? ఇపుడు ఆ లిస్టులో చేరిపోయింది నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ ప్రియమణి. ఈమె దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు, ఒక్క మెగాస్టార్ తో తప్ప. అయితే ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో ఆమె వెండితెర సినిమాలతోపాటు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రియమణి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈమె నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నటువంటి ప్రియమణి మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలందరి సరసన నటించానని చెబుతున్నారు. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించలేదని తెలిపారు.

చిరంజీవి గారితో నటించాలని, ఆయనతో కలిసి రొమాన్స్ చేయాలని ఉంది. అంతేకాకుండా అతనితో కలిసి స్టెప్స్ వేయాలని వుంది. ఆ అవకాశం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని ప్రియమణి తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టారు. మరి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. మరి చిరంజీవి ఈమెకు అవకాశం ఇచ్చి తనతో నటించాలని ఉందనే కోరికను తీరుస్తారా… లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest