ప్రభాస్ నెత్తిన రూ.5 వేల కోట్ల వ్యాపారం… పెద్ద బాధ్యతే!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడు మామ్మూలుగా లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ఊపిరి సలపనంత బిజీగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాగా అందులో 2 సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. అందులో మొదటిది ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్.’ ఈమధ్య విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో రెబల్స్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. బాహుబలి తరువాత ఆ రేంజ్ హిట్ ప్రభాస్ కి పడలేదనే చెప్పుకోవాలి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా జూన్ 16న విడుదల కాబోతుందనే విషయం అందరికీ తెలిసినదే. ఇక ఆ తర్వాత సలార్ సినిమా లైన్లోకి రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో గట్టిగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.

ఇక ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్. అంటే దాదాపు 6 నెలల గ్యాప్ లో మూడు సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటుగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మారుతి ప్రభాస్ సినిమా కూడా రిలీజ్ అవుతుందట. అంటే ఇంచుమించుగా 12 నెలల వ్యవధిలో ప్రభాస్ 4 భారీ సినిమాలు భక్షాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలకు ప్రస్తుతం కోట్లలో బిజినెస్ జరుగుతుండడంతో ఈ సినిమాలన్నీ 1000 కోట్ల మార్క్ దాటి బిజినెస్ చేస్తాయని కొందరు జోశ్యం చెబుతున్నారు. అంటే కొంచెం ఈ నాలుగు సినిమాలతో ప్రభాస్ 5000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతాడని అంటున్నారు. మరి ప్రభాస్ అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి మరి.