వెస్ట్‌లో టీడీపీ-జనసేన లెక్క తేలినట్లేనా..స్వీప్ ఛాన్స్ ఉందా?

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయింది. ఇక సీట్ల విషయంపైనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి డ్యామేజ్ జరిగింది..కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని, రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి.

ఇక పొత్తులో ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారో ఇంకా లెక్క తేలలేదు. కాకపోతే సీట్ల పంపకాల విషయంలో ఎవరికి ఏ సీటులో బలం ఉందనే అంశంపై సర్వేలు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్ల పంపకాలపై సర్వేలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే జిల్లాలో 15 సీట్లు ఉంటే ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రకారం..టి‌డి‌పికి 5 సీట్లలో ఆధిక్యం ఉంటే..3 సీట్లలో జనసేనకు పట్టు ఉందని తేలిందట.

ఇక అంతర్గత లెక్కల ప్రకారం..మొత్తం మీద టి‌డి‌పికి 10, జనసేనకు 5 సీట్లలో పట్టు ఉన్నట్లు తెలిసింది. కాకపోతే ఆ సీట్లు ఏంటి అనేది ఇంకా లెక్కలు తేలలేదు. అయితే జనసేన వర్గాల్లో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే..జనసేనకు పట్టున్న సీట్లు..నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం సీట్లు అని తెలుస్తుంది. ఈ మూడు జనసేనకు దక్కడం ఖాయం. అలాగే ఏలూరుతో పాటు మరో సీటు జనసేన అడుగుతున్నట్లు సమాచారం.

టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే పశ్చిమలో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు ఓట్లు చీలిపోవడం వల్లే గెలిచింది. ఈ సారి ఆ పరిస్తితి ఉండదు కాబట్టి..వెస్ట్ లో టి‌డి‌పి-జనసేన స్వీప్ చేసిన ఆశ్చర్యం అవసరం లేదు.

Share post:

Latest