ఇన్‌స్టాలో 6 హీరోయిన్ల‌ను మాత్ర‌మే ఫాలో అవుతున్న‌ ప్ర‌భాస్‌.. ఇంత‌కీ వారెవ‌రో తెలుసా?

అప్పటివరకు టాలీవుడ్ లోనే స్టార్ గా ఉన్న ప్రభాస్.. `బాహుబలి` సినిమాతో పాన్‌ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ప్రభాస్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండ‌డు. అయినాస‌రే ఆయనకు రోజురోజుకు ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్ లో ప్రభాస్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య పది మిలియన్లకు పైగా ఉన్నారు. అయితే ప్రభాస్ మాత్రం త‌న ఇన్‌స్టాలో కేవలం 15 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. పైగా ఆ 15 మందిలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు.

ఇంత‌కీ ఆ హీరోయిన్స్ మరెవరో కాదు భాగ్యశ్రీ, శ్రద్ధా కపూర్, శృతి హాసన్, పూజా హెగ్డే, కృతి సనన్‌, దీపిక పడుకొని. ఈ ఆరుగురితోనూ ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం విశేషం. కాగా, ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రం `ఆదిపురుష్‌` వచ్చే నెలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు, కృతి స‌న‌న్‌ సీతగా నటించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అనేక‌ భాషల్లో అట్టహాసంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మ‌రికొద్ది రోజుల్లోనే ప్రభాస్ ఈ మూవీ ప్రమోషన్స్ లో జాయిన్ కాబోతున్నాడు.

Share post:

Latest