అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే చిత్రాన్ని తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఈసారి ఏకంగా ఆస్కార్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు మహేష్ కి హాలీవుడ్ రేంజ్ లో పేరు వచ్చేలా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Sreeleela Is Also Excited For The Title Launch Of Mahesh Babu's SSMB 28

ఇదిలా ఉండగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్లీ 12 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్లాస్ లుక్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన త్రివిక్రమ్ ఈసారి రూట్ మార్చి ఊరమాస్ లుక్ ట్రై చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన మహేష్ ఊర మాస్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇందులో మహేష్ ని మాస్ కా బాప్ అనేలా తీర్చిదిద్దారు త్రివిక్రమ్. ఇదిలా ఉండగా మరొకవైపు మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈనెల 31వ తేదీన సినిమా నుంచి టైటిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరొక అప్డేట్ ను కూడా చిత్ర బృందం వదిలింది. అదే రోజు మాస్ స్ట్రైక్ పేరుతో ఒక వీడియోని విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింపు తరహాలో ఒక థండర్ లాంటి వీడియోని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఇకపోతే యాక్షన్స్ సన్నివేషాలతో అభిమానులు పండగ చేసుకునేలా ఉంటుందని సమాచారం. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ మరొక కొత్త పోస్టర్ను విడుదల చేశారు . మొత్తానికి అయితే త్రివిక్రమ్, మహేష్ బాబు వరుసగా అభిమానులకు అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Share post:

Latest